Monday, April 5, 2021

Hi kakinada

  • కాకినాడ పేరు మొదట కాకివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కానాడగా చలామణి అయ్యింది.
  • కలియుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కోయిల రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
  • ఇక్కడకి మొదట ఫ్రెంచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత యవనులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత డియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కరేబియన్ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కకనాడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
  • బ్రిటీషువారి కాలంలో కాకెనాడగా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ-కకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జే ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
  • ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి కలువలు (కోకలు) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.

No comments:

Post a Comment